పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ఉప సర్పంచుల ఫోరం ఎన్నిక శుక్రవారం ముస్తఫాపూర్ బిఆర్ కె ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కేతిరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచుల ఫోరం ఎన్నిక జరిగింది. ఫోరం మండల అధ్యక్షులుగా ముస్తఫాపూర్ ఉపసర్పంచ్ తాళ్ల అరవింద్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రంగయ్యపల్లి, ధర్మారం, రాంనగర్, ఎర్రబెల్లి, కొత్తపల్లి, మల్లారం ఉపసర్పంచులు ఎలబోయిన రజిత, కొత్తపల్లి కళ్యాణి, భూక్య తిరుపతి, మాలోతు శోభ, బోడ రవీందర్, నారగోని సుమన్, ప్రధాన కార్యదర్శి ముత్తారం ఉపసర్పంచ్ మాట్ల హరికుమార్, బొడిగె శ్రీనివాస్, కార్యదర్శులుగా బొల్లోనిపల్లి, రసూల్ పల్లి, వీర్లగడ్డ తండా, వీరభద్ర నగర్, విశ్వనాధ కాలనీ ఉపసర్పంచులు బొల్లి సుమన్, కందుల అనిల్ కుమార్, గుగులోతు హరిలాల్, పాక సంపత్, కస్తూరి మల్లేష్, సంయుక్త కార్యదర్శిగా మాణిక్యాపూర్, రత్నగిరి ఉప సర్పంచులు మాచనపల్లి శ్రీనివాస్, గూడెల్లి రజిత, కోశాధికారి గాంధీనగర్, కొప్పూర్ ఉప సర్పంచులు బుర్ర సమ్మయ్య, మిర్యాల రాణి, కార్యవర్గ సభ్యులు సాయి నగర్, చంటయ్యపల్లి, కొత్తకొండ ఉపసర్పంచులు నాయిని రవీందర్, ముప్పు సాయి చంద్ర, తాళ్లపల్లి యాదగిరి, గౌరవ సలహాదారులుగా వంగర, గొల్లపల్లి, ముల్కనూర్ ఉపసర్పంచులు వొల్లాల రమేష్, ఎల్ది రాజు, కాసగోని మమత బాలకృష్ణలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య, సీనియర్ నాయకులు కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాష్, రమేష్, మహేష్, కరుణాకర్ వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.