ఉప సర్పంచ్ శనక్కాయల సత్యం నేతృత్వంలో బిఆర్ఎస్ విజయోత్సవ సభ

★ హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 10, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం నరసింహారావు పేట గ్రామంలో గోపాలపేట గ్రామ ఉప సర్పంచ్ శనక్కాల సత్యనారాయణ నేతృత్వంలో ది. 11-01-2025 అనగా ఆదివారం ఉదయం 11.00 గంటలకు నరసింహారావు పేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు తెలియజేశారు.ఈ సభ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఉప సర్పంచ్ గా శనక్కాయల సత్యనారాయణ ఎన్నికైన సందర్భంగా నిర్వహించబడుతుందని వారు తెలియజేశారు. ఈ విజయోత్సవ సభకు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రజాభినేత శ్రీ సండ్ర వెంకట వీరయ్య పాల్గొంటారు. ముందుగా అన్నారుగూడెం R&B రోడ్డు నుండి నరసింహారావు పేట గ్రామం వరకు అత్యధిక మోటార్ వాహనాలతో భారీ ర్యాలీ జరుగును. కావున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,సండ్ర వెంకట వీరయ్య అభిమానులు,తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అనుచరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము.