ఎక్స్‌లెంట్‌లో సంక్రాంతి సంబురాలు

★ ఆకట్టుకున్న విద్యార్థుల వస్త్రధారణ వేషధారణలు ★ పాఠశాలలో ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణం

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10 ఎక్స్ లెంట్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రాంగణం పండుగ కళతో కళకళలాడింది. హరిదాసుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గంగిరెద్దు వేషాల్లో చిన్నారులు అలరించారు.సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి నెలకొంది.సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించే కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను వివరించారు.విద్యార్థుల ఉత్సాహం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లెనిన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి వివరిస్తూ పెద్దల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఈ పండుగలను ప్రత్యేకంగా జరుపుకోవాలని, పూర్వ వైభవాలను తలపించేలా పండుగలను చేసుకోవాలని, రైతుల పంట దిగుబడులు వచ్చి వారి కుటుంబాలలో పండుగను ఆనందంగా గడుపుకునే సంవత్సరం అని అన్నారు.అనంతరం విద్యార్థినిలు వేసిన ముగ్గులను ఉపాధ్యాయ బృందం వీక్షించి వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో వేడుకలను పర్యవేక్షించారు. తల్లిదండ్రులు కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు మెరిశారు. పండుగ వాతావరణం అందరినీ ఆనందంలో ముంచెత్తింది. సాంస్కృతిక విలువలను విద్యార్థులకు చేరువ చేశారు. సంక్రాంతి సంబురాలు కనీ విని ఎరుగని రీతిలో జరిగాయి. పాటలు కోడిపందాలు నిర్వహించే తీరు, డప్పుల మేళంతో, వాతావరణం మార్మోగింది. సాంప్రదాయానికి ప్రతీకగా కార్యక్రమం నిలిచింది. విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం పెరిగింది. మొత్తానికి ఎక్స్‌లెంట్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.