కట్కాపూర్‌లో ఘనంగా చీరల పంపిణీ, జాతీయ అవార్డు సాధనపై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 10 మామిడిపెల్లి లక్ష్మణ్ కట్కాపూర్ గ్రామంలో శుక్రవారం మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పడాల పూర్ణిమ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా, నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామానికి చెందిన సర్పంచి, నేషనల్ అవార్డు గ్రహీత తిరుపతి రెడ్డి గ్రామాభివృద్ధి, సంక్షేమం, పరిశుభ్రత, పచ్చదనం, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను ఎలా సమర్థవంతంగా అమలు చేస్తే జాతీయ అవార్డు సాధించవచ్చో వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ధి పనులపై అవగాహన సదస్సు నిర్వహించి గ్రామ పాలకులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్ర గణేష్, వార్డ్ మెంబర్లు రంజిత్, రాజులు, రాజు, పద్మ, గౌతమ్, పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి, మహిళా సంఘాల అధ్యక్షులు, సీఏలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.