కాంగ్రెస్ పార్టీ.ఏసీ సెల్ చైర్మన్‌గా నియామకమైన. ఎమ్మెల్యే బెజ్జంకి నుండి ర్యాలీ.

పయనించే సూర్యుడు న్యూస్: జనవరి/10: నియోజకవర్గం రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు ప్రజలకు ఆహ్వానం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఏసీ సెల్ చైర్మన్‌గా నియామకమైన అనంతరం మన శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, జనవరి /10.న కరీంనగర్‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అందరూ బెజ్జంకి క్రాస్‌రోడ్ వద్ద జరిగే భారీ స్వాగత కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరడమైనది. అక్కడి నుంచి బెజ్జంకి క్రాస్‌రోడ్ కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీగా ఘనంగా నిర్వహించబడుతుంది. ర్యాలీ ప్రారంభం: ఉదయం 10:30 గంటలకు బెజ్జంకి క్రాస్‌రోడ్ ర్యాలీ ముగింపు: మధ్యాహ్నం 2:30 గంటలకు కరీంనగర్ కోర్టు ఏరియాలోని అంబేద్కర్ చౌరస్తా. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు,జిల్లా,మండల,గ్రామ నాయకులు, మహిళ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు_ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘన విజయం చేయాలని కోరుతున్నాను. చివరగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి. అధ్యక్షుడుమండల కాంగ్రెస్ కమిటి. ఇల్లంతకుంట.