పయనించే సూర్యుడు జనవరి. 10 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన కుమ్మర కులానికి చెందిన సర్పంచి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను, ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కమిటీ, మరియు మండల కమిటీ, పట్టణ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు తొగరి రఘు, నాంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గంగాధరీ తిరుపతి, సెక్రటరీ ప్రసాద్, చంద్రం, తిరుపతి, నగేష్, గంగన్న, నారాయణ, రవి, తదితరులు పాల్గొన్నారు.