కోడిపందాలు నిర్వహించటం చట్టరీత్యా నేరం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎమ్మార్వో శాంతిలక్ష్మి

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 10 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి అనంతరం గ్రామంలో కోడిపందాలకు సంబంధించి బ్యానర్ పట్టుకొని ర్యాలీగా ఉన్నత అధికారులతో ఎంపీడీవో శ్రీనివాస్ మరియు గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మ కుమార్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ర్యాలీతో గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మండల తాసిల్దార్ శాంతి లక్ష్మీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు నిర్వహించకూడదనే సదుద్దేశంతో శుక్రవారం పెనుగంచిప్రోలు మండలంలోని కార్యలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసారు. , కోడి పందాలు జంతు క్రూరత్వ నిరోధక చట్టానికి విరుద్ధమని, అలాగే న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని *హెచ్చరించారు. గ్రామ స్థాయిలో ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి , సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ , పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి, కోడి పందాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామన్నారు అనంతరం కోడి పందాలు నిర్వహించడానికి, పాల్గొనడానికికు వ్యతిరేకంగా నినాదాలు చేసారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, పంచాయతీ కార్యదర్శి శ్యాం కుమార్ కాకాని పద్మ వీఆర్వోలు వీఆర్ఏలు రెవిన్యూ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *