కోరపల్లి ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు జనవరి 10 హుజురాబాద్ రూరల్ కోరపల్లి ఉన్నత పాఠశాలలో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు . అందులో భాగంగా విద్యార్థినీవిద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో పాఠశాలకు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు . విజేతలైన అమ్మాయిలకు అభినందనలతో పాటు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి గారు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి. రాజయ్య, పి శ్రీనివాస్, ఎ. నరహరి , సి. రవికాంత్ రాజు, పి. కుమారస్వామి, పి. రాజు , కె. పద్మ, పి. విజేందర్ రెడ్డి , మైమున్నిసా , శ్రీమన్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *