పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10,2026, ఖమాన, వాంకిడి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. వాంకిడి మండల కేంద్రంలోని ఖమాన గ్రామ పంచాయతీలో పశువైద్య మరియు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు , మేకలకు చర్మ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పశువైద్య అధికారి డాక్టర్ శరణ్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునీత , ఉప సర్పంచ్ లోబడే లహుకుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. గొర్రెలు , మేకలకు ఆరోగ్య పరిరక్షణకు, చర్మ వ్యాధి నివారణ టీకాలు ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్య సిబ్బంది గణపతి, రాజు, నరేష్, వినోద్, లాలజి పాల్గొని గొర్రెలకు , మేకలకు చర్మ వ్యాధి నివారణ టీకాలు చేశారు. అలాగే గ్రామస్తులు ప్రవీణ్ , నానేష్ , శంకర్ , రాహుల్ , గోపాల్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు..