
పయనించే సూర్యుడు జనవరి 10 కరీంనగర్ న్యూస్: గుండ్లపల్లి x రోడ్ గ్రామ సర్పంచ్ చింతల ఉమారాణి - అనిల్ కుమార్ మాట్లాడుతూ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామంలో త్రాగునీటి సమస్య ఉన్నందున త్రాగునీటి కోసం వెంటనే బోరు వేయించి గ్రామ ప్రజలందరికీ నల్లల ద్వారా ఇంటింటికి త్రాగునీరును అందించారు గ్రామం లో మెన్ రోడ్ లో టాయిలెట్స్ తొందర్లోనే పని ప్రారంభిస్తాము వీధి దీపాలు కూడా తొందర్లోనే ఏర్పాటు చేస్తాము గ్రామ సర్పంచ్ గా నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు నన్ను గుండ్లపల్లి x రోడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా మా పాలకవర్గం తోటి ప్రమాణ స్వీకారం అంగ రంగ వైభవంగా చేసినాము నేను గుండ్లపల్లి x రోడ్ గ్రామంలో గ్రామ ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చినాను గ్రామంలో ఉన్న సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు గ్రామం పరిశుద్ధ కార్మికుల తోటి చెట్లు గాని డ్రైనేజీలు గాని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతానని అన్నారు నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిదీపాలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వాటిని మంజూరు చేపిస్తానని అన్నారు గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి వితంతు పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్లు ఇప్పిస్తానని అన్నారు గ్రామంలో 24 గంటలు అందుబాటులో నిస్వార్థ సేవకురాలుగా మీ ఇంటి పెద్ద బిడ్డలగా ప్రజల కోసం అందుబాటులో ఉంటానని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
