చిన్న మండవ గ్రామంలో కళాజాత, మ్యాజిక్ షో.

పయనించే సూర్యుడు జనవరి 10, చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాగులవంచశాఖ వారు నాబార్డ్ వారి సౌజన్యంతో ఖమ్మం రీజినల్ మేనేజర్ వారి ఆదేశాల మేరకు చిన్న మండవ గ్రామంలో కళాజాత మ్యాజిక్ షోప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్యాంకు మేనేజర్ బ్యాంకు మేనేజర్ నాగ సురేష్,ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ,గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ , గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మరియు సాంకేతికత అక్షరాస్యత పై అవగాహన తో పాటుగా జనరల్ ఇన్సూరెన్స్, సైబర్ నేరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిజిటల్ లావాదేవీలు , బ్యాంక్ రుణాలు మరియు స్కీములపై ఈ కార్యక్రమంలో కామెడీ జోక్స్ లతో ప్రజలను కళాకారులు ఆకట్టుకున్నారు. కళాకారులు విభూతి శ్రీనివాసరాజు విప్ప ఏడుకొండలు పాల్గొన్నారు.