చైనా మాంజా వైరు తగిలి కూలికి తీవ్ర గాయం

పయనించే సూర్యుడు, జనవరి 10 బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్ మండల పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. గోపిరాజుపల్లి గ్రామం మొండికుంట స్టేజీ సమీపంలోని ఒక మామిడి తోటలో పనిచేస్తున్న కూలి ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. ​వివరాలప్రకారం గోపిరాజుపల్లికి చెందిన పిడుగు ఐలయ్య అనే వ్యక్తి స్థానిక మొండికుంట స్టేజీ వద్ద ఉన్న మామిడి తోటలో కూలి పనుల నిమిత్తం వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో తోటలో పని చేస్తుండగా,ఎక్కడో తెగివచ్చిన గాలిపటం మాంజా వైరు ఐలయ్యకు బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయమైంది. ​వెంటనే తోటలోని తోటి కూలీలు మరియు స్థానికులు స్పందించి,క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బచ్చన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాలిపటాల మాంజా వైర్లు ప్రాణాంతకంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.