పయనించే సూర్యుడు రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 10 జనవరి 2026 సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ సామ్రాట్ గోవర్ధన్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో కుల, మత, రాజకీయ విభేదాల వల్ల తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. యువతకు చట్టాల పట్ల అవగాహన కల్పించేలా చూడాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై కాలయాపన జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిందితులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరంగా నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధితులకు సరియైన న్యాయం చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు