జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.

పయనించే సూర్యుడు జనవరి 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోనిలోని డా.జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 390 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వారిలో 227 మంది వివిధ కంపెనీల కు ఎంపికయ్యారని కళాశాల కరస్పాండెంట్ కే.యస్.మురళీ బాబు , ప్రిన్సిపాల్ డా.డి.స్వామినాథ్ మరియు జిల్లా అధికారి ఆనంద్ రాజ్ కుమార్ ఓక ప్రకటనలో తెలిపారు.