పయనించే సూర్యుడు జనవరి 10 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపుమేరకు ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ , మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పూల నాగరాజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి యందు కలవడం జరిగినది, ఈ సందర్భంగా నారా లోకేష్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు చేపట్టవలసిన కార్యాచరణను వారికి దిశ నిర్దేశము చేశారు సంస్థాగత ఎన్నికలలో పార్టీ గెలుపే ధ్యేయంగా వారు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పార్టీ అనుబంధ కమిటీల విషయం కూడా ఈ సందర్భంగా వారి కి వివరించారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పనిసరిగా పార్టీలో గుర్తింపు ఉంటుందని వివరించినట్లు వారు తెలియజేశారు.
