పయనించే సూర్యుడు జనవరి 10 డివిజన్ రిపోర్టర్ సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గిరిజన సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆంగోతు మోహన్ అన్నారు. శుక్రవారం దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ కలిసి ఆయన ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలని లేఖలో సూచించారు. దేవరకొండ నియోజకవర్గం లో అత్యధికంగా గిరిజన సమాజం ఉందన్నారు. విద్య ఉద్యోగాలు ఉపాధి పరంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే దేవరకొండ జిల్లాగా మారడమే ఏకైక లక్ష్యం అన్నారు. విద్యా, వైద్యం,రహదారులు, ఉపాధి,గిరిజన సంక్షేమ పథకాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక జిల్లాగా మారిస్తే గిరిజన పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా సూచించారు. దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ప్రత్యేక చొరవ చూపి దేవరకొండ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లా ప్రకటించే వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ జిల్లాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడితే ఆ ఘనత బాలునాయక్ దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా దేవరకొండ నియోజకవర్గం గిరిజనులు దేవరకొండ జిల్లా ఏర్పాటు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆంగోతు మోహన్ నాయక్ కోరారు.