నవజ్యోతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): పట్టణంలోని దిబ్బలపాలెం నవజ్యోతి స్కూల్లో కరస్పాండెంట్ సుంకర రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హరిదాసు వేషధారణలో, సంప్రదాయ దుస్తుల్లో అలరించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రాంబాబు మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను విద్యార్థులకు తెలిసేందుకే ముందుగా సంక్రాంతి సంబరాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కే రామలక్ష్మి, ఎల్ లక్ష్మణరావు, ఎన్ ప్రియా, జి అనిత, ఎం బంగారం, జ్యోతి, శాంతి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.