నిద్ర మత్తులో రెవెన్యూ అధికారులు

పయనించే సూర్యుడు 10-1-2026 గొల్లపెల్లిమండల ప్రతినిధి (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక కంకర క్రషర్ క్యాంపు పక్కన మామిడి తోట వెనకాల ఉన్న గుట్టబోరును విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తూ కొందరు జెసిబి గుత్తేదారులు మట్టిని అమ్ముతూ చోద్యం చేసుకుంటున్న స్థానిక ప్రజానీకం అడిగితే వారిని బెదిరింపులకు గురి చేస్తూ ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాట్టుగా వ్యవహరిస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. అదే చనువుగా చూస్తూ మామిడి తోట యాజమాన్యం వారికి సహకరిస్తూ భూకబ్జాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మండల రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వదలిస్తున్న దాని వెనకాల ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎక్కడ చూడు మండలంలో విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్న,రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించకపోవడం మండలంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వమే స్పందిస్తాదా అధికారులు స్పందిస్తారా లేదా ప్రజలే తిరుగుబాటు చేస్తారా అనేదానిపై ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకనైనా తవ్వకాలను ఆపివేయాలని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానిక మండల వాసులు కోరుతున్నారు.