నూతనంగా ఎన్నికైన చేగుంట మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు న్యూస్ 10 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి , దుబ్బాక నియోజకవర్గం వివిధ హోదాలో ఉన్న నాయకులు అన్ని మండల నాయకులు అందరూ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలోని అన్ని గ్రామాల నుండి. వచ్చిన బైక్ లు ర్యాలీ మక్కారాజ్ పేట రోడ్డు గీత స్కూల్ నుండి మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు ప్రమాణ స్వీకారం జరిగింది చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు వార్డ్ సభ్యులు, మండల యూత్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ మహిళ నాయకురాలు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు