పుట్టకోట గ్రామంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడారు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 యడ్లపాడు మండల ప్రతినిధి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం గ్రామస్థాయి కార్యకర్తలే అని పేర్కొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపితం చేయాలంటే ప్రతి కార్యకర్త ఐక్యంగా, ధైర్యంగా ప్రజల మధ్య ఉండాలని సూచించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, ప్రజలకు అందించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడేలా గ్రామస్థాయి కమిటీలే పునాది అని, నాయకులు–కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పుట్టకోట గ్రామ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, ఎస్ సి సెల్ అధ్యక్షుడు వలేటి ఉదయ్ కిరణ్, బింజు సాంబశివరావు, గ్రామ నాయకులు, అభిమానులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు