ప్రజలు మెరుగైన వైద్య సేవను సద్వినియోగం చేసుకోవాలి

★ మాట్లాడుతున్న ప్రభుత్వ సలదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 బోధన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పట్టణంలోని చావిడి వద్ద బస్తీ దవాఖనను ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బస్తి దవాఖనను అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్యం ఓపి సేవలు మధుమేహం రక్తపోటు చికిత్స ఉచిత నిర్ధారణ పరీక్షలు ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ మరియు అధికారులు అనధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు