ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరంగా జరిగినవి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ప్రధానమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందాలు గాలిపటాలు ఎగురవేయుట మొదలగు కార్యక్రమాలతో పండుగ మూడు రోజులు అనగా భోగి, సంక్రాంతి కనుమపండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు భోగి మంటలు చుట్టూ చేరి గొబ్బెమ్మ పాటలు, నృత్యాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *