ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో భోగి మంటలు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంగోలి, గాలి పటాలు, సాంప్రదాయ వస్త్రధారణ, పిండివంటల తయారీ మొదలలైన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కళాశాల ఆవరణమంత సంక్రాంతి ఆటపాటలతో విద్యార్దులు సందడి చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్రాంతి అనేది మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మహత్తర పండుగని రైతుల కష్టానికి ఫలితం దక్కే ఈ పండుగ మన జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, ఐక్యతను నింపుతుందని, భోగి, సంక్రాంతి, కనుమల ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయని. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నైతిక విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కోరారు. అందరికీ ఆరోగ్యం, శాంతి, సంతోషం, అభివృద్ధిని ప్రసాదించాలని ఈ సంక్రాంతి దేవుని ఆశీస్సులతో నిండివుండాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు, విద్యార్థులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్య క్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె.వేంకటేశ్వర రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ అధ్యాపకులు వి రామ రావు కె.సురేష్.డా. శివప్రసాద్, వీరభద్ర రావు, ఎస్‌కే మదీనా, శ్రీలక్ష్మి, డా.కె.బంగార్రాజు, మేరి రొసిలిన, పుష్పా, సతీశ్, అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ, ధర్మ రాజు, దివ్య, రామలక్ష్మి కమల, కళావతి, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.