బంగ్లాదేశ్ లో మైనారిటీలు గా ఉన్న హిందువులపై దాడులను అరికట్టాలి.

* సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు

పయనించే సూర్యుడు జనవరి 10 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు శుక్రవారం నాడు నేరేడుచర్ల లోని సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. హసీనా దేశం విడిచి పారిపోయే పరిస్థితి నెలకొన్నదని తాత్కాలిక ప్రభుత్వం యూనిస్ నాయకత్వంలో ఏర్పాటయిందని. శాంతియుత వాతావరణం నెలకొంటదని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని మతశక్తుల ప్రమేయం మూలంగా నిరంతర మతవిద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ కార్యాలయాలపై యా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని. బంగ్లాదేశ్ మైనారిటీ సమూహాల అయినా హిందూ ,సిక్కు, బౌద్ధుల పైన దాడులు జరుగుతున్నాయని కొన్ని మత సంస్థలు ఒక ప్రణాళిక బద్ధంగా ఈ దాడులను జరిపి రాజకీయాల ప్రయోజనాలు పొందాలనుకుంటున్నాయని. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం మూలంగా సంఘటనలు మరింతగా ఎక్కువగా జరుగుతున్నాయని. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు మరొకవైపు భారత దేశంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఈ నేపథ్యంలో ఇక్కడ బిజెపి అక్కడ మత రాజకీయాలు చేస్తున్న సంస్థలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి సంఘటనలకు కారణమవుతున్నాయని తక్షణమే సంకుచిత రాజకీయాలు విడనాడి మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించాలంటే ఆదేశ హై కమిషనర్ మరియు పాలకులతోని మాట్లాడి దాడులను ఆపాల్సిన అవసరము ఉన్నది. మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి యల్లబోయిన సింహాద్ర , ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న, బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి కొమ్మరాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *