బిజినపల్లి ఎంపీడీవో-ఎమ్మార్వో ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానం

★ కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప ఎమ్మార్వో మునిరుద్దీన్

పయనించే సూర్యుడు జనవరి 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల ఎంపీడీవో కథలప్ప, ఎమ్మార్వో మునీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎంఈఓ రఘునందన్ శర్మ.ఎంపీఓ విశాల్. ఏపిఎం ఈశ్వర్. ఏపీఓ మల్లికార్జున్.తో పాటు ఇతర మండల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మండల పరిధిలోని 35 గ్రామపంచాయతీల సర్పంచులను అధికారులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కథలప్ప, ఎమ్మార్వో మునిరుద్దీన్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి గ్రామస్తునికి చేరేలా కృషి చేయాలని, పారదర్శక పాలనతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు.