బ్రిలియంట్ లో సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు ,ఆగస్టు 10 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ మరియు కోకో కోలా కంపెనీవారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపుగా 80 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన రంగవల్లులు ,సంస్కృతి సంప్రదాయాలకు మేళ వింపుగా నిలిచి చూపరులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ ముందుగా అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటే సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం. ప్రకృతికి సూర్యభగవానునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ. రైతులు కష్టించి పండించిన ధాన్యం ఇంటికి తెచ్చి పొంగళ్ళు చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం వ్యవసాయం, ప్రకృతి, కోడి పందాలు, పిల్లలకు రేగు పళ్ళు పోయడం వంటి కుటుంబ సంప్రదాయాల సమ్మేళనంతో తెలుగువారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగ విద్యార్థుల్లో ప్రతిభ ను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలను నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఆనాటి కాలం నుండి ఆడపడుచులు రంగవల్లులు వేసి మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల హెడ్ మిస్సెస్ స్వర్ణ కుమారి, కోకో కోలా కంపెనీ ఆర్గనైజర్స్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.