
పయనించే సూర్యుడు జనవరి 10, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). బోనకల్ గ్రామంలో 9వ వార్డు నెంబర్ గా ఎన్నికైన లావణ్య శివకృష్ణ దంపతులు శివకృష్ణ గురుకుల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేసే గురుకుల పాఠశాలలో విద్యా విధానంపై అవగాహన ఉండటంతో గురుకుల విద్యాలయాల అడ్మిషన్స్ నోటిఫికేషన్ రావడంతో అనేకమంది పేద విద్యార్థులు అప్లికేషన్ చేసుకునే విధానం తెలియక కొంతమంది విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని వారికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానిపైన అవగాహన కల్పిస్తూ పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో అప్లికేషన్ చేయడం జరుగుతుంది.బోనకల్లు మరియు పరిస ప్రాంతాల్లో అనేకమంది పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారని గుర్తించి మధిర స్వేరోస్ నియోజకవర్గ కమిటీ వారు శుక్రవారం లావణ్య శివ దంపతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర స్వేరో నియోజకవర్గ అధ్యక్షులు సోమపొంగు శ్యామ్ సుందర్ స్వేరో, మాగి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాగి ముఖేష్ స్వేరో, బోనకల్లు ఉప సర్పంచ్ బానోత్ కొండ, బానోత్ శ్రీనివాస రాథోడ్, తిరుమలాపురం సర్పంచ్ వీరబాబు స్వేరో, తిమ్మినేనిపాలెం 3వ వార్డ్ నెంబర్ మీరా సాహెబ్,స్వేరో రవికుమార్ స్పారో తదితరులు పాల్గొన్నారు.