పయనించే సూర్యుడు జనవరి 10 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. పేద బ్రాహ్మణులు ఎవరైనా మరణించిన వెంటనే కర్మకాండలు నిర్వహణ కోసం గరుఢ అనే పథకాన్ని ప్రవేపెట్టి 10వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు బిజెపి నాయకులు వెల్లాల మధుసూధనశర్మ, కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు.బ్రాహ్మణులు మరియు అర్చక పురోహితుల సమస్యలపైన అనేక వేదికల పైన ప్రస్తావించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కృషి కూడా ఉందని మధుసూదన శర్మ తెలిపారు.ఈ ప్రభుత్వం గరుడ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు నాయుడుకి ఉన్న అభిమానాన్ని చాటి చెప్పినట్టైందని మధుసూదన శర్మ లలితమ్మతెలిపారు.గతములో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ పథకము ఉండేదని అప్పుడు కొన్ని వేల కుటుంబాలకు న్యాయం జరిగిందని,2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణ కార్పోరేషన్ కి బడ్జెట్ పేపరులో నిధులు కేటాయింపు తప్ప కార్పోరేషన్ అకౌంట్ లోకి నిధులు కేటాయింపు లేకపోవడం వల్ల గరుడ పథకముతో పాటుగా అనేక పథకాలు అమలుకు నోచుకోక పేద బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని మధుసూదన శర్మ లలితమ్మ విమర్శించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రములోని బ్రాహ్మణులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని మధుసూదన శర్మ, లలితమ్మ అన్నారు.