పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని అంబేద్కర్ కూడలిని జంక్షన్ చేయాలని, అలాగే తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని యధా స్థానంలో ఉంచాలని హుస్నాబాద్ నియోజకవర్గం ఎమార్పీఎస్ ఇంచార్జ్ మాట్ల వెంకటస్వామి, తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి కండె సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్కతుర్తి నుండి సిద్దిపేట నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడాలీని జంక్షన్ చేయాలని, తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని యధా స్థానంలో ఉంచాలని మండల దళిత సంఘ నాయకులు గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని పలుమార్లు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ఎల్కతుర్తి తరహాలో ముల్కనూర్ అంబేద్కర్ కూడనీ జంక్షన్ చేసి, అమరవీరుల స్థూపాన్ని అదే స్థానంలో ఉంచాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో భీమదేవరపల్లి మండల దళిత సంఘ నాయకులు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు..