మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వంగర లో ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ కొండిపాముల సుహాసిని అధ్యక్షతన వంగర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చిదురాల స్వరూప హాజరైనారు. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు.ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్, వంగర గ్రామ కాంగ్రెస్ నాయకురాలు సుహాసిని విజేతలకు మొదటి బహుమతి 10,016, రెండో బహుమతి 5,016, మూడో బహుమతి 2,500 నగదు, నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందాల్సించిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ పోటీలు విద్యార్థులలో ఐకమత్యాన్ని పెంపొందించుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *