పయనించే సూర్యుడు కోరుట్ల, జనవరి 10 మంగళవారం రోజున కోరుట్ల పిఎస్ లో నమోదైన కేసు యొక్క వివరాలు ఏమనగా కోరుట్ల ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ నిర్వహించాలంటే వాళ్ళ మొబైల్ అసోసియేషన్ వాళ్లకి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే ఇక్కడ బిజినెస్ నిర్వహించగలరని, లేకుంటే ఇక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామని వారిని తుపాకులు మరియు కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారని , దానికి భయపడి వాళ్ళు 30 వేల రూపాయలని కూడా ఇట్టి వ్యక్తులకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించామని,ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండ బోయిన అరుణ్ ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1)మార్త శివకుమార్, 2)భోగ శ్రీనివాస్, 3)అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేయబడి దర్యాప్తులో భాగంగా, జిల్లా ఎస్పీ .శ్రీ .అశోక్ కుమార్ ఐపిఎస్, గారి ఆదేశాల మేరకు, మరియు మెట్టుపల్లి డిఎస్పి ఏ.రాములు గారి ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు గారు మరియు కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి రెండు టీములుగా ఏర్పడి నిన్న సాయంత్రం ఈ బెదిరింపులకి పాల్పడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రైఫిల్ మరియు ఒక ఎయిర్ గన్ పిస్టల్ మరియు ఒక తల్వార్ మరియు మూడు చిన్న కత్తులని మరియు వాళ్లు వీడియో కాల్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లని స్వాధీనపరచుకొని వారిని ఈరోజు కోర్టు వారి మందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించనైనది, మరియు భవిష్యత్తులో ఎవరైనా కోరుట్ల పట్టణంలోని వ్యాపారస్తులను గాని రియాల్టర్లను గాని లేదా రైస్ మిల్లర్స్ యజమానులను గాని బెదురుంపుల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లతే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని రౌడీషీట్లు ఓపెన్ చేసి, పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని పోలీస్ శాఖ వారు హెచ్చరించారు.