యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

★ ఎం తిరుమల రావు డైరెక్టర్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్)

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ -10:- యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని డైరెక్టర్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) ఎం.తిరుమల రావు అన్నారు.శుక్రవారం జి.యం కార్యాలయం నందు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్ తో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.తదుపరి ఓ.సి.1 డంపు పై నడుస్తున్న 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించి, పనులను వేగవంతం చేసి త్వరితగతిన సోలార్ ప్లాంట్ ఉత్పత్తి అందుబాటు లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి తీసుకుంటున్న చర్యల గురించి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్ వివరించారు.అనంతరం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, రామగుండం-2 ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య, ఇతర అధికారులు డైరెక్టర్ ని సన్మానించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన ఓ.బి, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి భద్రతతో సాధించాలని, అందుకు కావలసిన చర్యలను, ప్రణాళికను రూపొందించుకోవాలని, యంత్రాలు ఎక్కువ సమయం ఉపయోగించినందుకు అందుబాటులో ఉండేలా చూడాలని, పని విధానాన్ని మెరుగుపరుచుకోవాలని, పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోలార్ జనరల్ మేనేజర్ సీతారామం, ఎస్వోటు డైరెక్టర్ వై.విజయ శేఖర బాబు, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఎస్వోటు జిఎం యం.రామ్మోహన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి.శంకర్, ఏరియా సర్వే ఆఫీసర్ జనార్ధనరెడ్డి, ఎస్టేట్స్ అధికారి ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బిరుద్దీన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.