పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 10: రాజు హై స్కూల్ లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సీఈవో రఘురామరాజు, ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, తెలుగు పండితులు రామసుబ్బారెడ్డి, సోని, ఫర్హాన, విజయ, జ్యోతి మరియు పాఠశాల సిబ్బంది సహకారంతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో విద్యార్థులు గ్రామ సీమలను తలపించేలా వేషధారణలతో అలరించారు. భోగి మంటలు వేసి, పొంగళ్ళు పెట్టి జానపద నృత్యాలతో అలరించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు రేగిపండ్లు తల మీద చల్లి ఆశీర్వదించారు. గొబ్బెమ్మ ను ఏర్పాటు చేసి పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ-ఉపాధ్యాయులు విజయ, రమణ, గాయత్రి, సుధామణి, శిరీష, సుమలత, శశికళ, కావ్య, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.