లయోల పాఠశాలలో ముందస్తు ఘనంగా సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 బోధన్:బోధన్ పట్టణంలో లయోల పాఠశాల కరస్పాండెంట్ సురేష్ ఆధ్వర్యంలోని విద్యార్థులు, విద్యార్థినిలు ఉపాధ్యాయుల బృందం సంక్రాంతి సంబరాలను శుక్రవారం రోజున ఘనంగా ఉత్సాహంగా జరుపుకున్నారు, ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని విద్యార్థినీలు రంగు రంగుల ముగ్గులతో , పూలతో అందంగా అలంకరించారు. సంక్రాంతి సంబరంలో భాగంగా విద్యార్థులు విద్యార్థినిలు రంగ వల్లులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, సంప్రదాయ దుస్తులు ధరించడం, హరిదాసుల వేషధారణ, భోగి మంటలు వేయడం, గాలిపటాలు ఏర్పరచటం బొమ్మల కొలువు ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సురేష్ మాట్లాడుతూ తెలుగు సంప్రదాయ పండుగలో సంక్రాంతి పండుగ మహిళలు చిన్నారులు జరుపుకుంటారని పాఠశాలలో ఆవరణలో విద్యార్థినీయుల ఆట పాటలతో నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నట్టు ఆనందోఉత్సవంతో పాఠశాలలోని పల్లెటూరి అలంకరణ తో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొందిని తెలిపారు. విద్యార్థులకు సంక్రాంతి వేడుక ద్వారా సంప్రదాయ పండుగ ప్రాముఖ్యతను, సంస్కృతిని విలువలు తెలుసుకుంటారని తెలిపారు. ఈ వేడుక ద్వారా విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, సంస్కృతిని నేర్పించడం పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరస్పాండెంట్ సురేష్ ఉపాధ్యాయల బృందం, విద్యార్థులు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.