పయనించే సూర్యుడు జనవరి 10 ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య చేజర్ల మండలం లుంబిని విద్యాలయం నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు లో భాగంగా విద్యార్ధినులు చే ముగ్గుల పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన బాలికలకు ప్రథమ , ద్వితీయ మరియు తృతీయ బహుమతి ప్రదానోత్సవం చేయుట జరిగింది. భోగి మంటలేసి అనంతరం విద్యార్ధిని విద్యార్థులచే కోలాటం మరియు సాంకృతిక కార్యక్రమములో భాగంగా హరిదాసులు, గంగిరెద్దులు వారి వేషాలతో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినులు సిబ్బంది పాల్గొన్నారు.
