వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 10 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండల కేంద్రంలోని వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు మోటారు వెహికల్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చిట్టిబాబు, ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు హాజరై ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ షేక్ ఖాదర్ వలి, డైరెక్టర్ షేక్ జిలానీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.