సత్తుపల్లిలో అటల్ బీహార్ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్

పయనించే సూర్యుడు: జనవరి 10 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయబాబు ఫైనల్ మ్యాచ్‌లకు పోటెత్తిన క్రీడాభిమానులు – విజేతలకు బహుమతుల ప్రదానం అటల్ బీహార్ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ,శుక్రవారం ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లను తిలకించేందుకు అశేష సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ని వీరంరాజు, సత్తుపల్లి సిరి గోల్డ్ & డైమండ్ షోరూం అధినేత కుసంపూడి కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. వారు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి, మ్యాచ్‌లను ప్రారంభించి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల్లో భాగంగా, యువతను క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వక్తలు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో రుద్రాక్షపల్లి జట్టు మొదటి బహుమతిని బుగ్గపాడు జట్టు రెండో బహుమతిని కొమరం భీమ్ కాలనీ జట్టు మూడో బహుమతిని గెలుచుకున్నాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, చదువుతో పాటు క్రీడలను కూడా యువత జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. వాజ్పేయి హయాంలో క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యతను కొనసాగిస్తూ, నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా క్రీడలకు విశేష ప్రోత్సాహం లభిస్తున్నదని తెలిపారు. యువత క్రీడలను ఒక జీవన విధానంగా స్వీకరించి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బానోత్ విజయ్, మాజీ మండలాధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శివ యాదవ్, కార్యదర్శి కార్తీక్ యాదవ్, సాయి వర్ధన్, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు.