సరుకుల నాణ్యతపై రాజీ లేదు

★ ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి పీఓ యువరాజ్ మర్మాట్

పయనించే సూర్యుడు జనవరి 10 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:- ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు ఇతర సరుకుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు శుక్రవారం ధరల నిర్ణయ కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటించని గుత్తేదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా సరఫరా చేసే ప్రతి వస్తువును నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.