సహకార సంఘం ఉద్యోగస్తుల, జీవో నెంబర్ 36 ను అమలు చేయాలి

(పయనించేసూర్యుడు.న్యూస్. జనవరి10 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) సహకార సంఘ ఉద్యోగుల ద్దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఐదు ఒకటి 2026 నుండి 9 1 2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల జేఏసీ పిలుపుమేరకు కర్నూలు జిల్లా యూనియన్ ఆదోని బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘం ఉద్యోగులందరూ ధర్నా చేయడం జరిగింది జీవో నెంబర్ 36 ను వెంటనే అమలుపరిచి 2019 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేయాలని ఉద్యోగుల కు చెల్లించేది రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్స్ 62 సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులకు ఐదు లక్షల తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలను కుటుంబాలకు భరోసా కల్పించాలి అనేక సంఘాల్లో 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులకు వెంటనే రెగ్యులర్ చేయాలి వారికి కూడా జీవో నెంబర్ 36 అమలు పరచాలి పిఎసిఎస్ ద్వారా కాకుండా డిసిసిబిల ద్వారా రైతులకు డైరెక్ట్ గా రుణాలు ఇస్తున్నారు దీనివలన పిఎసిఎస్ నిర్వీర్యం అయిపోతున్నవి ఈ విధానాన్ని మార్పు చేసి అన్ని సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి సంఘాలు చెల్లించిన చేరుదనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం ఆరు శాతం వడ్డీ చెల్లించాలి సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఎస్ఎఫ్ ను ఆప్కాబ్ డిసిసిబిలు పిఎస్సి లతో ఏర్పాటుచేసి మూడు సంవత్సరాల నిబంధన కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా చెల్లించాలి ప్రస్తుతం పనిచేయుచున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈఓ పదవులను వీరితో భర్తీ చేయాలి