సాలూర పాఠశాలలో మాక్ పార్లమెంట్

★ ప్రజా ప్రతినిధుల వేషధారణలో విద్యార్థులు.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 బోధన్ :సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, విద్యా శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకులుగా విద్యార్థులను ఎన్నుకొని సభ నిర్వహించారు. పాఠ్యపుస్తకాల గురించి సభలో చర్చ నిర్వహించి తీర్మానాన్ని ఓటింగ్ ద్వారా బిల్ పాస్ చేశారు. లోక్ సభ మాదిరిగానే విద్యార్థులు పార్లమెంట్ సెషన్ ను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి, ఉపాధ్యాయులు రాజకుమార్, లక్ష్మీ పర్యవేక్షలుగా వ్యవహరించారు. విద్యార్థుల సంభాషణకు ఉపాధ్యాయులందరూ మంత్రముగ్ధులయ్యారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మండల విద్యాశాఖ అధికారి రాజీమంజుష ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, సాయిలు, సంగీతారావు, సంతోష్ యాదవ్, విజయలక్ష్మీ, శోభారాణి, వనజ, జోత్న్స, అంజన, సాయిలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.