పయనించే సూర్యుడు జనవరి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్, స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్, ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు ఇవ్వాలని, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, జక్కడి శివ చరణ్ రెడ్డి అన్నారు. భద్రాచలం పర్యటనలో భాగంగా ఏన్కూర్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నిమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో శివచరణ్ రెడ్డికి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తీసుకెళ్లడం జరిగిందని, కానీ సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు ఇచ్చి ప్రోత్సహించాలని ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టి తీసుకెళ్లడం జరిగిందని శివ చరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 300 మంది యూత్ కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగిందని, ఎనిమిది వందల మంది యూత్ కాంగ్రెస్ లీడర్లు వార్డ్ మెంబర్గా గెలిచారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పార్టీని ముందుకు తీసుకెళుతున్నాయని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని శివ చరణ్ రెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ గ్రామ సర్పంచ్, అజ్మీర సురేష్, కాంగ్రెస్ నాయకులు నిమ్మల నరేందర్, పంతగాని నరేష్, సామేలు, ప్రకాష్, సీనియర్ జర్నలిస్టు, గుగులోత్ బావుసింగ్ నాయక్ నరేష్, కిషోర్, రాము, కృష్ణ, తదితరులు ఉన్నారు.