పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్ కు చెందిన కొంతం చందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం పరిధిలోని హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో 1,20,200 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ చేతుల మీదుగా కొంతం చందు తల్లి కొంతం వనిత కు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహకారానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కొంతం చందు తల్లి కొంతం వనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.