పయనించే సూర్యుడు 10-01-2026 నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు భైంసా పట్టణంలోని. వాసవి, శ్రీ సరస్వతి సుభద్ర వాటిక శిశుమందిర్, నారాయణ, ఆల్ ఫోర్స్, వికాస్, చైతన్య పాఠశాలలో మరియు భైంసా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు, బాలురు) పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి స్టడీ మెటీరియల్ (ఆల్ ఇన్ వన్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి విద్యార్థులు క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోను వాడటం ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. మంచిగా చదివి తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల పేరు నిలబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.