పయనించే సూర్యుడు 11-1-2026 గొల్లపెల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద గత కొంతకాలంగా సిటీ లైట్ బల్బులు వర్షానికి ఉరుములకు షార్ట్ సర్క్యూ కావడం వలన వీరిదీపాలు వెలగడం లేదు ప్రధాన రహదారి మూలమలుపు కూడలి కావడం వలన బాటసారిలకు వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అత్యవసర పరిస్థితిలో దారి వెంట నడవాలంటే చాలా ప్రమాదకరంగా ఉండడంవల్ల బాటసారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇకనైనా పాలకులు పట్టించుకోని లైట్లు వెలిగేలా చూడాలని బాటసారిలు స్థానిక వాడ ప్రజలు కోరుతున్నారు.