పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 11 కడప ప్రతినిధి: వెంకటేష్ కొన్నిపాటి కడప నగరంలోని అక్షర స్కూల్ లో కరస్పాండెంట్ లలితమ్మ, ప్రధానోపాధ్యాయులు బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి అలనాటి సంస్కృతి ఉట్టిపడేలా వేషధారణలతో అలరించారు. గొబ్బెమ్మ ప్రతిష్టించి నృత్యాలు చేశారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం సంప్రదాయ బద్ధంగా చిన్నారులను రేగిపండ్లతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ -ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
