అనిగండ్లపాడుగ్రామంలో మెగా రక్తదాన శిబిరం

★ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న... సాయి, గ్రామ జనసేన అధ్యక్షులు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 11 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు శంకరశెట్టి సాయి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కలసి శివాలయం సెంటర్ లో జనవరి 11 వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8:30 ని. నుండి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామ అధ్యక్షులు సాయి మాట్లాడుతూ అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడమంటే మరొకరికి జీవితాన్ని ఇవ్వడమేనని, 3 నెలలకు ఒక్కసారి తప్పకుండ రక్తదానం చేయవచ్చని, 18 నుండి 60 సంవత్సరాలలోపు ఆరోగ్యవంతులందరు రక్తదానం చేయవచ్చని అన్నారు. అలాగే రేపు జరగనైయున్న రక్తదాన శిభిరానికి ముఖ్యతిధులుగా జిల్లా జన సేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఆంధ్ర జోన్ సెంట్రల్ కన్వీనర్ బాడిత శంకర్ రానైయున్నారని, తప్పకుండ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున ఈ రక్తదాన శిభిరంలో పాల్గొని జయప్రదం చేయాల్సినదిగా పిలుపునిచ్చ