అమ్దాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ

★ భూమి పూజ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 బోధన్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఇజిఎస్ 12లక్షల రూపాయల నిధులతో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శనివారం బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్బంగా నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగా శంకర్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నడిపి వసంత్ రెడ్డి అమ్దాపూర్ గ్రామ సర్పంచ్ పోరెడ్డి గంగాధర్, ఉప సర్పంచ్ పోతన్కర్ రుమ్మజీ అంగన్వాడీ టీచర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.