
పయనించే సూర్యుడు, అశ్వాపురం, 11-01-2026 ఈరోజు అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగినది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఇందిరా మహిళా శక్తి చీరకు అర్హులే మరియు ప్రతి మహిళ కూడా మహిళ సంఘంలో కచ్చితంగా ఉండాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హత గల కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సమస్యలు, విద్యుత్ వసతులు వంటి అంశాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాగంసరిత, వేములపల్లి హసీత, గుర్రం త్రివేణి, కొర్సా ముత్తమ్మ,చింతల అనుపమ, బానోత్ పద్మ, చెట్టిపల్లి రమాదేవి, మోర్వనేని చంద్రకళ, వివోఏలు, సంఘ సభ్యులు, డోక్రా మహిళలు, గ్రామపంచా సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.