ఆదోని జిల్లా సాధన జేఏసీ పత్తికొండ కన్వీనర్ గా

★ బురుజుల నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నిక

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11ఆదోని డివిజన్ ఇంచార్జి గుమ్మల బాలస్వామి) పత్తికొండ లో ఆదోని జిల్లా సాధన జేఏసి ఏర్పాటు చేసిన నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ గా బురుజుల నాగభూషణం ఏకాగ్రీవంగా ఎన్నిక.పట్టణంలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్ లో జరిగినటువంటి ఆదోని జిల్లా సాధన జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పత్తికొండ పట్టణ మరియు నియోజకవర్గ ప్రముఖులు పాల్గొని ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి ప్రసంగించారు. ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని పత్తికొండలో బలంగా తీసుకెళ్లాలని వక్తలందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేసుకొని సోమవారం నుండి దీక్షలు ప్రారంభించాలని జెఎసి తీర్మానించింది. సోమవారం నుండి దీక్షలు ప్రారంభం. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసి నాయకులు నూర్ అహ్మద్, సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రామచంద్రయ్య, మాదాసి, మాదారి కురువ సంఘం కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు గురజాల నాగభూషణం, క్రైస్తవ సంఘాల నాయకులు మరియు థామస్ గారు మరియు బీసీవై నాయకులు నరేంద్ర యాదవ్, టీచర్ నాయని లక్ష్మన్న, లోక్ సత్తా జయరాముడు, జేఏసీ నాయకులు అయ్యాళప్ప,కోదండ, దస్తగిరి నాయుడు, రాయచూర్ రామకృష్ణ, వీరభద్ర స్వామి సంగాల వెంకటేశు, వర్ల మోహన్, మంకె లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు.