పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామమునకు చెందిన కొనకళ్ళ శ్రీనివాసరావు విజయలక్ష్మి ల కుమార్తె కొనకళ్ళ అంకిత, ఇటీవల కాలంలో కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ లా వరంగల్ నుంచి ,న్యాయ శాస్త్రంలో పట్టా తీసుకొని, ఇటీవల జరిగిన ఆలిండియా బార్ కౌన్సిల్ ఆఫ్ లా, ఏఐబిఇ జాతీయ పరీక్షలో, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది, ప్రాథమిక పాఠశాల తిరుమల కుంటలో ఏడవ తరగతి వరకు, 8 నుంచి 10 వరకు మామిళ్ళ వారి గుడి హైస్కూల్లో, వి కే డి వి జూనియర్ కళాశాల అశ్వరావుపేటలో ఇంటర్ విద్య, లా సెట్ 5 సంవత్సరముల కోర్స్ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వరంగల్లో సీటు సాధించారు. మంచి ఫలితాలు ఉత్తీర్ణత సాధించి ఏఐబికి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినది, గ్రామస్థులు, ఆమెతోపాటు , చదువుకున్న విద్యార్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, భవిష్యత్తులో న్యాయ శాస్త్రంలో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు,